భారతదేశం, డిసెంబర్ 1 -- Xiaomi 13 Series, iQoo 11 Series launch postponed: షావోమీ, ఐకూ కంపెనీలు తదుపరి సిరీస్ ఫ్లాగ్‍షిప్‍ ఫోన్లను లాంచ్ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో అవాంతరం ఎదురైంది. షావోమీ 13 సిరీస్ చైనా లాంచ్‍‍ను వాయిదా వేస్తున్నట్టు షావోమీ ప్రకటించింది. నేడు (డిసెంబర్ 1) ఈ ఈవెంట్ జరగాల్సింది. మరోవైపు ఐకూ 11 సిరీస్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఐకూ పేర్కొంది. ఈ సిరీస్ ఈనెల 2న చైనాలో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే లాంచ్‍ను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించిన రెండు కంపెనీలు తదుపరి తేదీలను మాత్రం ప్రకటించలేదు.

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (Jiang Zemin) బుధవారం మృతి చెందారు. లాంచ్ ఈవెంట్‍లను షావోమీ, ఐకూ వాయిదా వేసేందుకు ఇది కారణం అయి ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి. 1993 నుంచి 2003 వరకు చైనాకు పదేళ్ల పాటు అధ్యక్షుడ...