Hyderabad, ఫిబ్రవరి 28 -- మానవాళి పుట్టి ఇప్పటికి వేల ఏళ్ళు దాటింది. ఈ మొత్తం కాలంలో అత్యంత చెత్త కాలం గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మనిషి జీవించడానికి దారుణమైన పరిస్థితులు ఏర్పడిన కాలం అది. ఆ ఏడాది 536వ సంవత్సరం. ఆ కాలంలో మనిషి జీవించడం అంటే నరకంతో సమానంగా మారిపోయింది. 18 నెలల పాటు మనుషులు ఆ ఏడాది జీవించేందుకే ఎంతో కష్టపడ్డారు. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, యూరోప్‌లోని కొన్ని ప్రదేశాల్లో 18 నెలలపాటు చీకటిమయంగా మారిపోయింది.

536వ సంవత్సరంలో ఒక వింతైన పొగ మంచు యూరోప్, ఉత్తర ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలను కప్పేసింది. దాదాపు 18 నెలల పాటు పగలు, రాత్రి అనే తేడా లేదు, అన్నివేళలా చీకటి. సూర్యుడు కూడా చంద్రుడిలా ప్రకాశం లేకుండా ఏడాది పొడవునా కనిపించాడు. వేసవిలో కూడా ఉష్ణోగ్రతలు 2.5 సెంటీగ్రేడ్లే ఉండేది. చాలా చోట్ల వేసవిలో కూడా మంచు కురిసింది. ప...