Hyderabad, మార్చి 3 -- గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే, మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటున్నారు బ్రెయిన్ సైంటిస్టులు. ప్రత్యేకించి కరోనా లాంటి సమయంలో చాలా మంది తమకు వైరస్ సోకిందనే భయంతో కూడిన ఆలోచనలతోనే గుండెనొప్పికి గురయ్యారు. అలా మెదడుపై గుండె ఒక్కటే కాదు, మిగతా శరీర భాగాలెన్నో ఆధారపడి ఉన్నాయి.మరి వాటన్నింటినీ సంరక్షించుకోవాలంటే, ముందుగా ఈ చెడ్డ పనులను చేయడం మానేయాలి. వెంటనే అలవాట్లను మార్చుకోవాలి. ఇంతకీ ఆ చెడ్డ అలవాట్లు ఏంటంటే..

శారీరక శ్రమ తగ్గిపోవడం మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందట. చాలా అధ్యయనాల్లో రుజువైన విషయమేమిటంటే, ఎక్సర్‌సైజ్ డైలీ చేసే వారిలో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం తక్కువగా కనిపించిందట. అంతేకాకుండా, మెదడులోని జ్ఞాపక శక్తికి కారణమయ్యే హిప్పోక్యాంపస్ అనే భాగానికి సపోర్ట్ అందిస్తుంది.

వయస్సు ఎక్కువైందనో, ఇతర కారణాలతో ఖాళీగా కూర్చోక...