Hyderabad, మార్చి 22 -- నీరు మనిషికి జీవనాధారం. శరీరంలోని ప్రతి జీవక్రియ నీరు చాలా చాలా అవసరం. కేవలం శరీరం కోసం మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నీటిపై ఆధారపడి ఉంటుంది. పంటలు పండేందుకు, వంటల తయారీకి, జంతువులు జీవించేందుకు, పరిశ్రమలు నడపడానికి, పరిశోధనలు చేయడానికి, విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి, పర్యావరణానికి ఇలా అన్నింటకీ నీరు అవసరం.నేడు మార్చి 22 ప్రపంచ జల దినోత్సవాన్ని నీటి ప్రాముఖ్యత, సంక్షోభం వంట వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకోవాలనే తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ మొదటిసారిగా 1992 డిసెంబర్ 22న ఆమోదించింది. తరువాత మార్చి 22ని ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొదటి ప్రపంచ జల దినోత్సవాన్ని 1993లో జరుపుకున్నా...