భారతదేశం, ఏప్రిల్ 2 -- World's Richest list: 2025 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ తన ప్రపంచ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ లిస్ట్ లో ఎక్కువగా అమెరికన్లే ఉన్నారు. ఆలిస్ వాల్టన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా కొనసాగుతున్నారు.

ఫోర్బ్స్ 2025 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం, ఈ సంవత్సరానికి గానూ, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 3,028 మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 247 మంది పెరిగారు. వీరు మొత్తంగా 16.1 ట్రిలియన్ డాలర్ల సంపదతో 2 ట్రిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో అమెరికా రికార్డు స్థాయిలో 902 మంది బిలియనీర్లతో అగ్రస్థానంలో ఉంది. వాస్తవానికి టాప్ 10లో 8 మంది అమెరికన్లే కావడం విశేషం. ఈ లిస్ట్ లో 516 మంది బిలియనీర్లతో చైనా (హాంకాంగ్ తో సహా), 205 బిలియనీర్లతో భారతదే...