Hyderabad, ఫిబ్రవరి 18 -- ఉప్పు చాలా చవకైన పదార్థం. కిలో కావాలంటే ఇరవై రూపాయలకే వచ్చేస్తుంది. నెల అంతా ఆ 20 రూపాయల ప్యాకెట్ సరిపోతుంది. అంత చవకైన ఉప్పును మనము వాడతాము. అయితే ప్రపంచంలోనే అతి ఖరీదైన ఉప్పు కూడా ఉంది. దీని కొనాలంటే ఒక కిలోకి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. దీని పేరు కొరియన్ బాంబూ సాల్ట్.

అనేక రకాల ఉప్పులు మార్కెట్లో ఉన్నాయి. తెల్ల ఉప్పు, నల్ల ఉప్పు, రాతి ఉప్పు ఊరగాయ ఉప్పు, పింక్ సాల్టు ఇలా ఎన్నో రకాలు వీటి ధరలన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. కానీ కొరియన్ బాంబూ సాల్ట్ ధర మాత్రం చాలా ఎక్కు.వ దీన్ని తయారు చేయడం కూడా కాస్త కష్టమైన ప్రక్రియగానే ఉంటుంది. అందుకే దీని ధర అధికంగా ఉంటుంది.

వెదురు కర్రలో ఉపయోగించి ఈ ఉప్పును అత్యంత ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారు. ఈ ఉప్పు తయారీలో అనేక దశలు ఉంటాయి. వీటన్నింటినీ దాటాకే ఉప్పు బయటికి వస్తు...