Hyderabad, మార్చి 4 -- ప్రపంచంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. ఇది అనేక అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 4న ప్రపంచ ఊబకాయం దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఈ రోజును చేసుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ఊబకాయం విషయంలో ప్రజల్లో అవగాహన పెంపొందించడం, నివారణ, చికిత్స గురించి వివరించడం.

ఈ ఏడాది ప్రపంచ ఊబకాయం దినోత్సవం థీమ్ 'చేంజింగ్ సిస్టమ్స్, హెల్తీయర్ లైవ్స్'. అంటే వ్యవస్థల మార్పు, ఆరోగ్యకరమైన జీవితం. ఊబకాయం ఒక ఆరోగ్య సమస్య అని గుర్తుంచుకోండి. దీనితో బాధపడుతున్న వ్యక్తికి గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఒక నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మందికి పైగా ఊబకాయం బారిన పడ్డారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నప...