Hyderabad, మార్చి 13 -- ప్రపంచ కిడ్నీ దినోత్సవం ప్రతి యేటా మార్చి 13న నిర్వహించుకుంటారు. ఈరోజున మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. అలాగే మూత్రపిండాల మన శరీరంలో ఎంత ముఖ్యమైనవో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందో కూడా వివరిస్తారు. అందరికీ కిడ్నీలు కేవలం వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి మాత్రమే అనుకుంటారు. నిజానికి అవి మన శరీరంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. కిడ్నీలు దెబ్బతింటే జీవన విధానం మారిపోతుంది. ఆరోగ్యంగా జీవించడం చాలా కష్టంగా మారుతుంది. మన శరీరంలో కిడ్నీలు ప్రముఖంగా చేసే ఏడు పనులు ఏంటో తెలుసుకుంటే... అవి ఎంత ముఖ్యమైనవో అర్థమవుతుంది.

మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేసి అందులో ఉన్న వ్యర్థ ఉత్పత్తులను, అదనపు ద్రవాలను తొలగిస్తాయి. అవే మూత్రంగా బయటికి విసర్జనకు గురవుతాయి.

మన శరీరంలో సోడియం, పొటాషియం, క్లోర...