భారతదేశం, మార్చి 8 -- నాలుగు నెలల వ్యవధిలోనే భారత్ కు చెస్ లో మరో ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ దక్కింది. గ్రాండ్ మాస్టర్ ప్రణవ్ వెంకటేష్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. మాంటెనెగ్రోలోని పెట్రోవాక్ లో జరిగిన టోర్నమెంట్ ఓపెన్ కేటగీరిలో ప్రణవ్ అదరగొట్టాడు. 11 రౌండ్ల నుంచి 9 పాయింట్లు సాధించి టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ప్రపంచ జూనియర్ చెస్ టోర్నీ అండర్ -20 ఈవెంట్ లో 44 దేశాలకు చెందిన దాదాపు 230 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓపెన్ విభాగంలో 63 దేశాలకు చెందిన 157 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. ఇందులో 12 మంది గ్రాండ్ మాస్టర్లు కూడా ఉన్నారు. వీళ్లందరినీ దాటి ప్రణవ్ టైటిల్ సాధించడం సాధారణ విషయం కాదు. గతేడాది డిసెంబర్ లో గుకేశ్ ప్రపంచ సీనియర్ ఛాంపియన్ గా నిలిచి హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్ గా నిల...