Hyderabad, ఫిబ్రవరి 4 -- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025: ప్రతి ఏడాది ఫిబ్రవరి 4 న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించుకుంటారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించుకోవడం వెనుక ఆ వ్యాధిపై అవగాహన పెంచడమే ముఖ్య ఉద్దేశం. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో క్యాన్సర్ అధికంగా కనిపిస్తోంది. ప్రపంచంలో 1.3 బిలియన్ల జనాభా ఉంటే అందులో 18 శాతం జనాభా భారతదేశంలోనే ఉంది. వచ్చే దశాబ్దంలో భారత్ లో కోటి మంది క్యాన్సర్ తో బాధపడతారని వైద్యులు అంచనా వేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, కాలేయం, నోటి కుహరం, కడుపు, గర్భాశయ క్యాన్సర్ గురించి చాలా మందికి తెలుసు. ఇవి సాధారణ రకాల క్యాన్సర్. కానీ కొన్ని అరుదైన క్యాన్సర్లు కూడా ఇప్పుడు మన దేశంలో విస్తరిస్తున్నాయి.

అరుదైన క్యాన్సర్లు ప్రతి 10,000 జనాభాలో 6 మందికి వస్తాయి. అందుకే వాటిని అరు...