Hyderabad, ఫిబ్రవరి 4 -- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 చరిత్ర: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4 ను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (2025) గా నిర్వహించుకుంటారు. క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ఈ వ్యాధితో పోరాడటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలను బలోపేతం చేయడం ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం వెనుక ఉద్దేశ్యం. నేడు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం, 2023 సంవత్సరంలో, భారతదేశంలో 14,96,972 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 2040 నాటికి భారత్ లో కేన్సర్ కేసులు రెట్టింపు అవుతాయని అంచనా. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఉద్దేశ్యం ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మాత్రమే కాదు, దాని నివారణ, చికిత్స పై కూడా ప్రజలకు తెలిసేలా చేయడమే.

2000 ఫిబ్రవరి 4 న పారిస్ లో ప్రారంభమై...