Hyderabad, మార్చి 8 -- సృష్టికి మూలమైన స్త్రీని ఒకప్పుడు వంటింటి కుందేలుగా చూశారు. ఇప్పుడు ఆమె అంతరిక్షపు అంచులను తాకి వస్తోంది. పురుషుడే బలవంతుడని... స్త్రీ బలహీనురాలని భావించే రోజులు పోయాయి. పురుషులతో సమానంగా మహిళలు కూడా ముందడుగు వేస్తున్నారు. విజయాలు సాధిస్తున్నారు. ఉన్నత శిఖరాలకు చేరుతున్నారు. దానికి ఉదాహరణ ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్. మగవారితో సమానంగా ఆమె కూడా అంతరిక్షం అంచులను చూస్తోంది. స్త్రీ అడుగుపెట్టని రంగమే నేడు లేదు. మనిషి ఉనికికి కారణమైన మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విషెస్ చెప్పాల్సిన అవసరం ఉంది. మీ జీవితంలో మీ అభ్యున్నతికి కారణమైన ప్రతి మహిళకు అందంగా తెలుగులోనే విషెస్ చెప్పండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....