Hyderabad, మార్చి 7 -- ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గౌరవించడానికి ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహించుకుంటాము. ఈ వేడుకరోజు ఎంతో మంది మహిళల గొప్పతనం గురించి వేదికపై మాట్లాడుతూ ఉంటారు. మీరు కూడా అందరూ మెచ్చుకునేలా స్పీచ్ ఇవ్వాలనుకుంటే... ఇక్కడ మేము మహిళా దినోత్సవ స్పీచ్ ను సింపుల్‌గా ఇచ్చాము. దీన్ని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ మీ స్పీచ్ విన్న తర్వాత చప్పట్లు కొట్టడం ఖాయం.

మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న మహిళలు అందరికీ నా ధన్యవాదాలు. ఆధునిక మహిళలు ఇకపై పురుషులపై ఆధారపడే అవసరం లేకుండా ముందుకు సాగుతున్నారు. ఆమె ప్రతి అంశంలోనూ స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. పురుషులతో సమానంగా ప్రతిదీ చేయగలుగుతుంది. స్త్రీ శక్తి అసాధారణమైనది. ఆమె ఎక్కడ పని చేసినా కూడా ఆ ప్రదేశం భోగ భాగ్యాలతో ...