Hyderabad, మార్చి 4 -- స్త్రీ అంటే శక్తి స్వరూపం. ఆమె ఉన్న చోట ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంటికి, సమాజానికి వెలుగు మహిళే. నేడు స్త్రీలు అడుగుపెట్టని రంగం లేదు. అన్ని రంగాలలో తమ ముద్ర వేసుకుంటూ పురుషులతో సమానంగా పనిచేస్తూ లింగ సమానత్వ సూత్రాన్ని ప్రోత్సహిస్తున్నారు.

స్త్రీలు సాధించిన విజయాలను గుర్తించి, గౌరవించడంతో పాటు మహిళా సమానత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. మహిళా దినోత్సవం ఎప్పుడు, దీని చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ సమాచారం ఉంది.

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. భారతదేశం సహా ప్రపంచంలోని అనేక దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు.

మహిళా దినోత్సవం వెనుక ఎంతో చరిత్ర ఉంది. 20వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన కా...