Hyderabad, మార్చి 7 -- మహిళలు మగవారితో పోలిస్తే ఎందులోనూ తక్కువ కాదు. కానీ ప్రాచీన కాలం నుండి వారికి ఇంటిని, వంటింటిని బాధ్యతలుగా అప్పచెప్పారు. ఆధునిక కాలంలో ఇప్పుడిప్పుడే మహిళలు తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని రంగాల్లో అడుగుపెడుతున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు ఎన్నో అంశాల్లో మెరుగ్గా ఉంటారని అధ్యయనాలు చెప్పాయి. పురుషులకన్నా మహిళలు ఎంత శక్తివంతులో తెలుసుకోండి.

ఏ వ్యక్తికైనా మంచి జ్ఞాపకశక్తి ఉండడం చాలా ముఖ్యం. జ్ఞాపకశక్తి విషయానికి వస్తే పురుషుడి కంటే స్త్రీ చాలా ఉత్తమం. ఆమెకు ఏదైనా గుర్తుంచుకోగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో విషయాలను వారు ఎక్కువ కాలం పాటు గుర్తించుకుంటారు.

ఒక మనిషికి భావోద్వేగాలు ఎంతో ముఖ్యం. ఒక మనిషిపై ప్రేమ, దయ, కరుణ వంటివి కలగడం కూడా భావోద్వేగాలే. పురుషులతో పోలిస్తే స్త్రీ...