Hyderabad, మార్చి 7 -- వారసత్వం అంటే కొడుకులకే అనుకునే రోజులు పోయాయి. లీడర్‌షిప్ క్వాలిటీస్ పెంచుకుని వివిధ రంగాల్లో సత్తా చాటుతున్నారు. విభిన్న రంగాల్లో కీలకంగా ఎదుగుతూ వేగంగా వృద్ధి సాధిస్తున్నారు. ఇక వ్యాపార రంగం గురించి చెప్పుకుంటే, కొడుకులు లేని కుటుంబాల్లో తామే వారసులుగా నిలిచి అండగా నిలుస్తున్నారు. కొత్త ఒరవడి సృష్టిస్తూ మార్పు, సంప్రదాయం కలయికతో వ్యాపారాలను నడిపిస్తున్నారు. కొత్త దృష్టి, ధైర్యమైన వ్యూహాలతో క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు.

గుల్షన్ గ్రూప్ డైరెక్టర్ యుక్తి నగపాల్ తన కుటుంబ వ్యాపారానికి వారసురాలిగా నిలిచారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోన్న ఈమె.. HT లైఫ్‌స్టైల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మాట్లాడుతూ.. "గుల్షన్ గ్రూప్‌లో, నాయకత్వం అనేది వారసత్వంగా కాదు. మనమే సంపాదించుకోవాలి. నిబద్ధత, దూరదృష్టి, ...