Hyderabad, మార్చి 7 -- ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈసారి కాస్త కొత్త విషయాలు తెలుసుకుందామా.. వనితా లోకమంటే కేవలం మన కళ్ల ముందు కనిపించేదే కాదని, బాలీవుడ్ నుంచి బిజినెస్ దాకా మహిళలు సాధించలేరని భావించిన రంగాల్లోనూ విజయకేతనం ఎగరేయగలదని గర్విద్దాం. దశాబ్దాల నాటి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఏ మాత్రం జంకు లేకుండా విస్తరించిన వ్యాపార సామ్రాజ్యపు బిజినెస్ ఉమెన్స్ గురించి తెలుసుకుందాం. మనసు పెట్టి పనిచేసి సినిమాలకు ప్రాణం పోసిన బాలీవుడ్ ఉమెన్ టెక్నీషియన్స్ టాలెంట్‌లను గుర్తిద్దాం.

ముందుగా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మాట్లాడుకుంటే, 1908లో కార్మిక ఉద్యమం నుండి వచ్చిన ఆలోచనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఐక్యరాజ్య సమితి 1975వ సంవత్సరం నుంచి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుప...