Hyderabad, ఫిబ్రవరి 22 -- ఇప్పటి యువత అందరూ గ్రామాలు విడిచి పట్టణాలలో ఉద్యోగం చేయడమే గొప్ప విజయంగా భావిస్తున్నారు. గ్రామంలోనే ఉండిపోతే వారిని చులకనగా చూసేవారు కూడా ఎక్కువమందే. కానీ శ్రద్ధా ధావన్ అలాంటి వారిని పట్టించుకోలేదు. ఆమె వయసు పాతికేళ్లే. కానీ ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తోంది. అది కూడా పాల వ్యాపారంతో.

భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసిన శ్రద్ధా కావాలనుకుంటే ఏదైనా మెట్రో సిటీలో ఉద్యోగం చేసుకోవచ్చు. ఉద్యోగం కన్నా వ్యాపారంలో ఎక్కువ సాధించవచ్చని ఆ అమ్మాయి అర్థం చేసుకుంది. అందుకే గ్రామంలోనే ఉండిపోయి తన తండ్రి పాల వ్యాపారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. చాలా తక్కువ సమయంలోనే కోటి రూపాయల వరకు ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది.

శ్రద్ధా ధావన్ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ దగ్గర్లోని నిగౌజ్ అనే గ్రామానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి దివ్యాంగుడు. ఆయ...