భారతదేశం, మార్చి 8 -- కొన్నేళ్లుగా భారతదేశంలో మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం దిశగా గణనీయమైన పురోగతిని సాధిస్తున్నారు. ఆటోమొబైల్​ రంగంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియాలో వాహనాలు కొంటున్న మహిళల సంఖ్య పెరుగుతోందని స్పిన్నీ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో స్పష్టమైంది.

స్పిన్నీ రిపోర్టు ప్రకారం.. 2023లో 16 శాతంగా ఉన్న మహిళా కస్టమర్ల సంఖ్య 2024 నాటికి 26 శాతానికి పెరిగింది. మార్చి 2025 నాటికి, ఈ సంఖ్య 46 శాతానికి చేరుకుంది. ఇది కొనుగోలు ధోరణులు, సామాజిక నిబంధనల్లో మార్పును ప్రదర్శిస్తుంది. ఈ ట్రెండ్ మహిళలు కార్లు నడపడమే కాకుండా పరిశ్రమలో మార్పుకు నాంది పలుకుతున్న కొత్త శకాన్ని సూచిస్తుంది.

మహిళా కొనుగోలుదారుల ప్రాధాన్యతలపై దృష్టి సారించింది స్పిన్నీ నివేదిక. 60 శాతం మంది ఆటోమేటిక్ హ్యాచ్​బ్యాక్​ల వైపు మొగ్గు చూపారు. కాంపాక్ట్ ఎస్​యూవీలకు కూడా...