భారతదేశం, ఏప్రిల్ 12 -- Women Missing In Forest : ఉత్కంఠకు తెరపడింది. ఆకు సేకరించేందుకు అడవిలోకి వెళ్లి తప్పిపోయిన నలుగురు మహిళలు సురక్షితంగా ఇంటికి చేరారు. దాదాపు 6 గంటల పాటు అడవిని మొత్తం జల్లెడ పట్టిన పోలీసులు చివరికి తప్పి పోయిన మహిళల్ని గుర్తించి గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు మహిళలు రాజుల రాధ, కంబాల లింగవ్వ, గట్టు మేడి లక్ష్మి, బత్తుల సరోజ గురువారం రోజున ఉదయం ఆ నలుగురు ఉపాధి నిమిత్తం తునికాకు సేకరణకు తునికాకు సేకరణకు వెళ్లారు.

అనుకోకుండా అడవిలో చిక్కుకుపోయారు, అదే సమయంలో మబ్బులు కమ్ముకుపోవడంలో అడవిలో చీకటి ఆవరించింది, దీంతో మహిళలకు దారి తెలియకుండా పోయింది. తిరిగి తిరగాలిసిపోయి వేలోకి చేరడంతో గంటలు కొద్ది అక్కడే బిక్కుబిక్కుమంటు కాలం వెళ్ల తీశారు....