Hyderabad, మార్చి 7 -- సాంకేతిక విప్లవం నడుస్తున్న కాలం ఇది. మగవారితో పాటు ఆడవారు కూడా సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. తమ ప్రతిభ పాటవాలను చూపిస్తున్నారు. సాంకేతిక రంగంలో ఉన్న అనేక ఉద్యోగాల్లో మహిళలు రాణించడం గర్వించదగ్గ విషయం. ఉమెన్స్ డే సందర్భంగా టెక్నాలజీ రంగంలో మన మహిళల అభ్యున్నతిని ఒకసారి తలుచుకుందాం.

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టి అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తున్నారు. వైజ్ఞానిక, సాంకేతిక, గణిత, ఇంజనీరింగ్ రంగాల్లో రాణిస్తున్న మహిళలు సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 33 శాతం ఉంది. ఒకప్పుడు ఈ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఏఐ వంటి అత్యాధునిక విభాగాల్లో పనిచేస్తున్న మహిళల సంఖ్య 22 శాతం ఉంది. అయితే ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన మహిళలు ప్రాతినిధ్యం వహించడం మన దేశానిక...