Hyderabad, జనవరి 28 -- మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు వయస్సుతో పాటు పెరిగి ఇబ్బంది పెడుతుంటాయి. మెనోపాజ్, హార్మోన్ల అసమతుల్యత, ఎముకల బలహీనత వంటివి అందులో ప్రధానంగా నిలుస్తాయి. చిన్న వయస్సులోనే PCOS (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) పెరగడం కూడా ఇందుకు కారణం. ఈ సమస్యలతో బాధపడే మహిళలు దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మునుపటి ఉత్సాహంతో జీవితాన్ని గడపాలనుకుంటే మీ ఆహారంలో ఈ 3 రకాల గింజలను చేర్చుకోవాలి. ఇవి మీ శరీరానికి అవసరమైన చాలా పోషకాలను అందించడంతో పాటు ప్రయోజనం చేకూరుస్తాయి.

అందరికీ అందుబాటులో ఉండే తెల్ల నువ్వులు పోషకాలకు నిధి. ఇందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇవి ఎముకలను బలపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగై రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. చర్మాన్ని కూడా ప్రకాశంగా మార్చి ఆరోగ్యవంతం...