Hyderabad, ఫిబ్రవరి 25 -- ఇద్దరు పిల్లల తల్లి ఏం సాధించగలదు?

అందులోను కార్ రేసింగ్‌లో అడుగు పెట్టింది,

కాలు చేయి విరగడం ఖాయం...

ఈమెకు అవసరమా ఇవన్నీ...

అంటూ లోకం ఆమెను కాకుల్లా పొడిచింది. అయినా కూడా డయానా వెనక్కి తగ్గలేదు. తాను అనుకున్న రంగంలో విజేతగా నిలిచే వరకు వెనక్కి చూడలేదు. డయానా పుండోల్ ఒక ఉపాధ్యాయురాలు. తరువాత ఆమె కార్ రేసర్‌గా మారింది. లోకం వెనక్కి లాగినా కూడా ఆమె రేస్ ట్రాక్‌లో ముందుకే పరుగులు తీసింది.

డయానా పుండోలే ఏ పని చేసినా అంకిత భావంతోనే చేస్తుంది. ఆమె ఉపాధ్యాయురాలుగా ఉన్నప్పుడు ఎంతోమంది పిల్లలను తీర్చిదిద్దింది. ఇద్దరు పిల్లలకి తల్లిగా మారాక ఇంటి పట్టునే ఉండమని ఎంతోమంది చెప్పారు. అయినా కూడా పిల్లలను కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమతుల్యంగా నిర్వహించుకుంటూ సమర్థంగా పనిచేసింది. అదే సమయంలో ఆమె మనసు రేసింగ్ వైపు మళ్ళింది. ఇప్ప...