భారతదేశం, మార్చి 30 -- Whizzy : ప్రముఖ డెలివ‌రీ పార్ట్నర్ సంస్థ 'విజ్జీ' సంప్రదాయ ఇంధ‌న ద్విచ‌క్ర వాహ‌నాలకు బ‌దులు త‌మ రైడ‌ర్లకు (ఎల‌క్ట్రిక్‌) బైక్‌ల‌ను అందించింది. హైదరాబాద్ గ‌చ్చిబౌలిలోని క‌పిల్ ట‌వ‌ర్స్‌లో గ‌ల 'విజ్జీ' ప్రధాన కార్యాల‌యంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ కార్యద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ చేతుల మీద‌గా రైడ‌ర్లకు ఈవీ బైక్ తాళాల‌ను అందించారు. అనంత‌రం జ‌యేష్ జెండా ఊపి ఈ బైక్‌ల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జ‌యేష్ మాట్లాడుతూ... ఈవీ వాహ‌నాల విప్లవంలో తెలంగాణ ముందు ఉంద‌ని, ప్రభుత్వం ఈవీ వాహ‌నాల‌కు అనేక రాయితీల‌ను ఇస్తుంద‌ని చెప్పారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ‌, ఈవీ విప్లవంలో 'విజ్జీ' భాగ‌మైనందుకు జ‌యేష్ అభినందించారు.

'విజ్జీ' సంస్థ హైద‌రాబాద్ కేంద్రంగా ప‌ని చేసే కంపెనీ. జెప్టో, బిగ్ బాస్కెట్‌, బ్లింక్ ఇట్‌, ఫ్లిప్‌కార్ట్‌, అపోలో త‌దిత‌ర సంస్థ...