Hyderabad, ఫిబ్రవరి 24 -- వేసవి వేడికి తట్టుకోలేక చాలా AC బాట పడుతుంటారు. కొత్తగా AC కొనుగోలు చేసేవారికి మార్కెట్లో ఆఫర్లు ఊరిస్తూ ఏది కొనుగోలు చేయాలో తెలియక తికమక పెడుతుంటాయి. మరి, మీరు ఆఫర్ చూసి కొనాలనుకుంటున్నారా? మీ అవసరాన్ని బట్టి సరిపడ కెపాసిటీ AC కొనాలనుకుంటున్నారా? డిసైడ్ చేసుకోండి. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ప్రొడక్టులు ఈజీగా దొరికేస్తున్నాయి. దీంతో మీ ఇంటికి లేదా వర్క్ లొకేషన్‌కి కొత్త ఎయిర్ కండిషనర్ (AC) కొనుగోలు చేయడం ఈ రోజుల్లో కష్టమైన పని కాదు. దీని కోసం AC కెపాసిటీ, విద్యుత్ ఖర్చు చేసుకునే సామర్థ్యం, స్మార్ట్ ఫీచర్లు గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఉత్తమమైన దానిని ఎంచుకోవడానికి, AC రకం, బ్రాండ్, టన్నులు వంటి ప్రాథమిక ఫీచర్లను తప్పనిసరిగా పరిశీలించాలి.

ప్రధానంగా రెండు రకాల ACలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు తగినదాన్ని మీరే ఎం...