భారతదేశం, ఏప్రిల్ 15 -- ఇప్పుడు ఎదుటివారికి ఏదైనా చెప్పాలనుకున్నా.. సంతోషంలో ఉన్నా.. స్టేటస్ పెట్టడం అనేది తప్పనిసరైపోయింది. కొంతమంది ఉదయం లేవగానే ఒక స్టేటస్. రాత్రి పడుకునేముందో మరో స్టేటస్ పెట్టనిదే రోజు గడవదు. అయితే ఈ స్టేటస్‌లలో వీడియో పెడుతుంటే కొందరికి ఆ సమయం సరిపోదు. అలాంటి వారి కోసం వాట్సాప్ శుభవార్త తీసుకొచ్చింది. వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది

వాట్సాప్ యూజర్లు 90 సెకన్ల నిడివి గల వీడియో స్టేటస్ అప్‌డేట్‌లను షేర్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. ఎంపిక చేసిన కొందరికి మాత్రమే ఇప్పటికే యాక్సెస్ కలిగి ఉంది. రాబోయే కొన్ని వారాల్లో ఇది యూజర్లకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. స్టేటస్-షేరింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సాప్ చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక భాగం.

ఇప్పటికీ వాట్సాప్ వీడియో స్టేటస్‌...