భారతదేశం, ఏప్రిల్ 6 -- ప్రస్తుత కాలంలో వాట్సాప్ తప్పనిసరైపోయింది. వాట్సాప్ లేనిది ఏ పని చేయలేనంతగా మారిపోయారు జనాలు. అయితే ఇది కూడా ఇప్పుడు సైబర్ నేరాలకు కేంద్రంగా మారింది. మరొక కొత్త రకం మోసం వచ్చింది. దీని బారిన మీరు పడకూడదనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. దీనిని మిస్సింగ్ పర్సన్ స్కామ్ అని పిలుస్తారు. ప్రజలకు తెలియని నంబర్ల నుండి ఫోటో వస్తోంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఫోన్ హ్యాక్ అయి బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది. భారతదేశంలో కూడా ఇలాంటి కేసులు కనిపించాయి.

వాట్సాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు తప్పిపోయినట్లు ఫొటోలు వస్తున్నాయని చెబుతున్నారు. ఆ ఫోటో మీద తప్పిపోయారు అని రాసి ఉంటుంది. ఈ ఫోటోపై క్లిక్ చేసిన వారి ఫోన్లు హ్యాక్ అయి, వారి బ్యాంకు ఖాతాలు క్షణాల్లో ఖాళీ అవుతాయి. ఈ సైబర్ మోసాన్ని 'వాట్సాప్ ఇమేజ్ స్కామ్' లేదా 'మాలిషియస్ లింక్ స్కామ్' అని...