భారతదేశం, జనవరి 2 -- WhatsApp Pay: యూపీఐ ఆధారిత చెల్లింపు సేవ అయిన వాట్సాప్ పే అధికారికంగా భారతీయ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. గతంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విధించిన యూజర్ లిమిట్స్ కారణంగా ఈ సేవలు కొంతవరకు పరిమితంగా ఉండేవి. కాగా, ఇప్పుడు ఆ అడ్డంకిని తొలగించారు. ఎన్పీసీఐ తన ఆంక్షలను సడలించిన తర్వాత 'వాట్సాప్ పే' ను ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా ఉపయోగించవచ్చు.

గత రెండేళ్లుగా భారత్ లో వాట్సాప్ పే గరిష్టంగా 100 మిలియన్ల యూజర్లకే పరిమితమైంది. సర్వీసు భద్రత, సజావుగా పనిచేసేందుకు ఎన్ పీసీఐ ఈ పరిమితి విధించింది. అయితే, ఆ ఆంక్షలను ఎన్పీసీఐ ఇప్పుడు సడలించింది. దాంతో, వాట్సాప్ పే ఇప్పుడు భారతదేశంలోని వినియోగదారులందరికీ యుపిఐ సేవలను అందించడానికి సిద్ధమైంది. "వాట్సాప్ పే ఇప్పుడు భారతదేశంలోని తన వినియోగదారులందరికీ యుపిఐ...