భారతదేశం, ఫిబ్రవరి 6 -- WhatsApp new features 2024 : యూజర్స్​కు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎక్స్​పీరియన్స్​ని ఇచ్చేందుకు నిత్యం కృషి చేసే దిగ్గజ సోషల్​ మీడియా సంస్థ వాట్సాప్​.. గతేడాది అనేక సరికొత్త ఫీచర్స్​ని లాంచ్​ చేసింది. వాటిల్లో 'ఛానెల్స్​' ఫీచర్​ ఒకటి. ఈ ఫీచర్​.. యూజర్స్​కి చాలా బాగా నచ్చింది. ఇక ఇప్పుడు.. 2024లో కూడా అనేక కొత్త ఫీచర్స్​ని తీసుకొచ్చేందుకు.. ఏర్పాట్లు చేసుకుంటోంది ఈ మెటా ఆధారిత వాట్సాప్​. ఇందులో భాగంగా.. ఓ కొత్త ఫీచర్​ని త్వరలోనే రిలీజ్​ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ ఫీచర్​ పేరు 'ఫేవరెట్​ కాంటాక్ట్స్​'. అది ఎలా పనిచేస్తుందంటే..

ఫేవరెట్​ కాంటాక్ట్స్​ ఫీచర్​కి అర్థం.. దాని పేరులోనే ఉంది. సాధారణంగా.. ఫోన్​ కాంటాక్ట్స్​లో ఫేవరెట్స్​, స్పీడ్​ డయల్స్​ వంటివి ఉంటాయి. అదే విధంగా.. ఈ కొత్త ఫీచర్​తో వాట్సాప్​లో కూడా మనం...