భారతదేశం, ఫిబ్రవరి 12 -- Whatsapp Governance: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనమిత్ర వాట్సాప్‌ సేవలు రికార్డు సమయంలో లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. జనవరి 30న ఏపీ ప్రభుత్వం వాట్సాప్‌ మనమిత్ర సేవల్ని ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వంతో గత ఏడాది అక్టో బర్‌లోనే మెటా ఒప్పందం చేసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖలు అందించే సేవల్ని మనమిత్ర ద్వారా నేరుగా వాట్సాప్‌లోనే అందిస్తోంది. ఇందుకోసం ఏపీలో ప్రత్యేక సర్వర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.

వాట్సాప్‌ మనమిత్ర సేవల్ని ప్రారంభించిన రెండు వారాల్లోనే 2.64లక్షల లావాదేవీలు జరిగినట్టు ఆర్టీజీఎస్‌ సీఈఓ కార్యదర్శుల సమావేశంలో వెల్లడించారు. ఈ లావాదేవీల ద్వారా రూ.54.73లక్షలు వసూలైనట్టు చెప్పారు. భవిష్యత్తుల్లో ఈ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. ఏపీలో ఉన్న ఐద...