భారతదేశం, జనవరి 28 -- Whatsapp Governace: ఏపీలో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సేవ‌లు త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్నామ‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. జ‌న‌న మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు కూడా వాట్సాప్ ద్వారా పౌరులు పొందే స‌దుపాయం క‌ల్పించాల‌న్నారు. అయితే ఈ స‌ర్టిఫికెట్ల జారీ ద్వారా ఎలాంటి అపోహ‌ల‌కు విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌కుండా ప‌గ‌డ్బంధీగా చేయాల‌న్నారు. ప్రజలకు సందేహ నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు.

ప్ర‌భుత్వంలోని అన్ని శాఖ‌ల డాటాను అనుసంధానం చేసే ప్రక్రియ వేగంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ సీఎంకు తెలిపారు. ప్రజల నుంచి సేక‌రించిన డేటా ఆధారంగా ప్ర‌తి గ్రామానికి ప్ర‌త్యేక ప్రొఫైల్ రూపొందిస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వంలోని 40 శాఖ‌ల‌కు సంబంధించి వివిధ శాఖాధిప‌తులు, విభాగాధిప‌తుల వ‌ద్ద ఉన్న డేటాను సేకరించి అనుసంధ...