భారతదేశం, ఏప్రిల్ 12 -- WhatsApp down: మెసేజింగ్ యాప్ వాట్సాప్ శనివారం సాయంత్రం చాలా మంది యూజర్లకు డౌన్ అయింది, సందేశాలు డెలివరీ కావడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. శనివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో 460కి పైగా వాట్సాప్ ఇష్యూ రిపోర్టులు వచ్చాయని డౌన్ డిటెక్టర్ తెలిపింది. వాటిలో 81 శాతం మంది సందేశాలు పంపడంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశారని తెలిపింది. కొందరు యూజర్లు తమ స్టేటస్ లను అప్ డేట్ చేయలేకపోతున్నామని, స్టోరీలను యాడ్ చేయలేకపోతున్నామని తెలిపారు. మరికొందరు వాట్సాప్ యాప్ లోకి లాగిన్ కాలేకపోతున్నామని పేర్కొన్నారు.

ఈ అంతరాయంపై వాట్సాప్ నుంచి తక్షణ ప్రకటన వెలువడలేదు. ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ అయిన వాట్సాప్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న కూడా అంతరాయం ఎదుర్కొంది. డౌన్ డిటెక్టర్ ప్రకారం, ఆ సమయంలో, వినియోగదారులు తమ సందేశాలు డెలివరీ కావడం లేద...