భారతదేశం, ఫిబ్రవరి 4 -- Paragon spyware in WhatsApp: కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పెగాసస్ ఉదంతం తర్వాత, ఇప్పుడు మళ్లీ మరో స్పైవేర్ హై ప్రొఫైల్ యూజర్లు లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ లోకి వచ్చింది. పారగాన్ పేరుతో వచ్చిన ఈ కొత్త స్పైవేర్ వాట్సాప్ ను ఉపయోగించే పలువురు ప్రముఖ పాత్రికేయులు, పౌర సమాజ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. హ్యాకింగ్ టూల్స్ ను అభివృద్ధి చేయడంలో పేరొందిన ఇజ్రాయెల్ సాఫ్ట్ వేర్ కంపెనీ పారాగాన్ ఈ దాడుల వెనుక ఉన్నట్లు సమాచారం. తమ ప్లాట్ ఫామ్ లోని హై ప్రొఫైల్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్ జరిగిందని వాట్సాప్ 'ది గార్డియన్'కు వెల్లడించింది.

ఈ స్పైవేర్ దాడి వెనుక ఎవరు ఉన్నారో ఇంకా స్పష్టంగా తెలియదని వాట్సాప్ పేర్కొంది. ఏదేమైనా, ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసిన స్పైవేర్ పెగాసస్ మాదిరిగానే పారాగ...