Hyderabad, మే 10 -- మనదేశంలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా కేరళలోని మూడు జిల్లాలైన మలప్పురం, కోజికోడ్, త్రిస్సూర్ లలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు కనీసం పది మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. వెస్ట్ నైల్ వైరస్ అనేది దోమల ద్వారా వ్యాపించే ఫ్లావి వైరస్. ఇది ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది.

వెస్ట్ నైల్ వైరస్ అనేది దోమల ద్వారా వ్యాపించే ఫ్లావి వైరస్. ఇది మనుషుల్లోనే కాదు, పక్షులలో కూడా ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఆఫ్రికా, యూరప్, పశ్చిమాసియా, ఉత్తర అమెరికాలో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది కేరళతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఈ జ్వరం కనిపిస్తోంది.

వైరస్ సోకిన దోమ మనుషులను కరవడం ద్వారా ఇతర మనుషులకు వ్యాపిస్తుంది. కేరళలో సాధారణంగా కనిపించే క్యూలెక్స్...