భారతదేశం, ఫిబ్రవరి 2 -- West Godavari : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోళ్లకు అంతు చిక్కని వ్యాధి సోకుతోంది. నిత్యం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది డిసెంబర్ లో మొదలైన వైరస్ వ్యాప్తి...జనవరి 13 తర్వాత తీవ్రమైందని రైతులు అంటున్నారు. ఆరోగ్యంగా కనిపించిన గంటల వ్యవధిలోనే కోళ్లు మృతి చెందుతున్నాయని వాపోతున్నారు. కోళ్లలో H15N వైరస్ లక్షణాలు ఉన్నట్లు వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండడంతో...పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 50 శాతం రైతులు నష్టపోయారని తెలుస్తోంది. దాదాపుగా 40 లక్షల కోళ్లు చనిపోయి ఉంటాయని అంచనా. మేత తిని, గుడ్డు పెట్టిన కొద్ది గంటల్లోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయని రైతులు అంటున్నారు. కోళ్లకు వ్యాక్సిన్ వే...