Hyderabad, జనవరి 30 -- బరువు పెరగడం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. అధిక బరువు అనేక రకాల వ్యాధులకు కూడా కారణం అవుతోంది. అందుకే ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా జాగ్రత్తపడాలి. అధిక బరువు, ఊబకాయం అనేవి అనేక రోగాలకు కారణం అవుతాయి. గుండె జబ్బులు, మధుమేహం వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ డైటీషియన్ బరువు తగ్గేందుకు ఉపయోగపడే సూప్ రెసిపీని నెటిజన్లకు వివరించారు.

పనీర్ తో పాటు అన్నిరకాల ఆరోగ్యకరమైన కూరగాయలతో సూప్ చేసుకుని తినడం ద్వారా శరీరంలోని కొవ్వును తగ్గించుకోవచ్చని సంప్రదాయ హోం రెమెడీస్ లో నమ్ముతారు.

1.4 మిలియన్లకు పైగా యూట్యూబ్ సబ్ స్క్రైబర్స్ ఉన్న డైటీషియన్ నటాషా మోహన్ ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో 'డిన్నర్ రెసిపీ'ని పోస్ట్ చేశారు. ఈ సూప్ వల్ల బరువు తగ్గవచ్చని ఆమె వివరిస్తున్నారు.

ఈ వీడియోలో పనీర్ క్యూబ్స్ ను, క్యారెట్, గ్రీన్ బీన్స్, బచ...