Hyderabad, మార్చి 14 -- శరీర బరువు అధికంగా పెరగడం ఎవరికీ ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ సన్నగా, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం చాలా మంది జిమ్‌లో కష్టపడటంతో పాటు, ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. డైటింగ్ చేస్తుంటారు. నిజానికి వెయిట్ లాస్ డైటింగ్ గురించి చాలా మందిలో తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. డైటింగ్ అంటే తక్కువగా తినడం లేదా ఒక పూట మొత్తం ఆహారం తినడం మానేయడం అని చాలామంది అనుకుంటారు. ఇలా అనుకునే చాలామంది రాత్రి భోజనం చేయడం మానేస్తుంటారు. నిజానికి ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

డైటింగ్ అంటే ఆహారాన్ని స్కిప్ చేయడం కాదు.. తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం. ఇలా చేయడం వల్లల శరీర బరువు అదుపులో ఉండటం మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు వంటివి రావు. అలా మీ శరీర బరువును పెంచకుండానే మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్...