Hyderabad, ఏప్రిల్ 7 -- బరువు పెరగడం అనే సమస్య ఒక్కరిది కాదు ప్రపంచంలోనే ఉన్న కోట్ల మందిది. ఎంతో మంది బరువు తగ్గడం కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. బరువు తగ్గాలంటే ఎంతో కష్టపడాలి. మీరు మీ రోజును ఎలా ప్రారంభిస్తారనే దానితోనే ప్రతి ఒక్కరి వెయిట్ లాస్ జర్నీ ప్రారంభమవుతుంది.

ప్రతి ఉదయం సరైన దినచర్య వల్ల ఆరోగ్యకరమైన టోన్ ను సెట్ చేస్తుంది. బరువు తగ్గించే కోచ్ అయిన జిక్ జియోపో తన ఇన్ స్టా ఖాతాలో 110 పౌండ్ల (49.89 కిలోలు) బరువు తగ్గించి అంశం గురించి వీడియో షేర్ చేశాడు. కోచ్ నిక్ జియోపో తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో క్రమం తప్పకుండా ఆరోగ్యం, బరువు తగ్గించే చిట్కాలను పంచుకుంటాడు.

ఎవరైనా లావుగా ఉన్నప్పుడు, ప్రతిరోజూ ఒకే సమయానికి మేల్కొనడం, ఒక గ్లాసు నీరు త్రాగటం ఆ తరువాత నడకకు వెళ్ళడం వంటివి చేయాలి. ఇవి బరువు తగ్గడానికి ఉత్తమమైన ఉదయం దినచర్య. ఇలా చిన్...