Hyderabad, ఫిబ్రవరి 17 -- బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు అనేక పద్ధతులను అనుసరిస్తారు. పోషకాహారం తినడంతో పాటూ వ్యాయామం చేయడం వంటివన్నీ బరువు తగ్గే ప్రయాణంలో భాగమే. కొందరు వేగంగా బరువు తగ్గాలని అనేక మార్గాలను వెతుకుతారు. అలాంటి వాటిలో ఒకటి ఉదయాన ఖాళీ పొట్టతో వేడినీరు తాగడం ఒకటి.

ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచాక ఖాళీ పొట్టతో వేడినీరు తాగడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా? లేదా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది. దీనివల్ల చాలా వేగంగా బరువు తగ్గుతారని అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఖాళీ పొట్టతో నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.

వేడినీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల శరీరంలో ఎక్కువ కేలరీలు కరిగిపోతాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి దోహదపడే అంశాలు.

వేడి నీరు ...