Hyderabad, ఫిబ్రవరి 27 -- నేడు పెరుగుతున్న బరువుతో దాదాపు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఊబకాయం ఒంటరిగా రాదు బరువు పెరుగుదలను అదుపు చేయకపోతే, శరీరాన్ని అనేక రకాల అనారోగ్యాలకు నిలయంగా మారుస్తుంది. బరువు తగ్గే ప్రయత్నం చేసేవారు ముందుగా డైట్‌ను మార్చుకుంటారు. ఈ సమయంలో చాలామంది తమ ఆహారంలో చాలా వస్తువులను తొలగిస్తారు, వాటిలో ముఖ్యమైనది అన్నం. అన్నం తింటే బరువు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే అన్నంలో పిండి పదార్థాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

కానీ మొదటి నుంచీ ఉన్న అలవాటు కారణంగా రైస్ ప్రేమికులకు పూర్తిగా అన్నానికి దూరంగా ఉండటం అసాధ్యంగా మారుతుంది. అన్నం తినకుండా రోజు గడవటం కష్టమే అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే రైస్ డైట్ మీల్ ప్లాన్. దీనికి అనుగుణంగా కొన్ని జాగ్రత్తలు పాటించారంటే అన్నం తింటూనే శరీర బరువును తగ్గించుకోవచ్చు. బర...