భారతదేశం, మార్చి 3 -- మీ ఎత్తుకు తగిన బరువులో లేరా? ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారా? చాలా బద్ధకంగా ఉన్నారా? సులువైన మార్గంలో బరువు తగ్గాలని చూస్తున్నారా? మీరు నిద్రపోతున్నప్పుడు శరీరంలోని అదనపు కొవ్వును కరిగించవచ్చని మీకు తెలుసా? నమ్మట్లేదా? అయితే ఈ కింది చిట్కాలు పాటించండి.

మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును నిజంగా కరిగించుకోవచ్చు. అందుకు జీవనశైలిలో కొన్ని మార్పులు క్రమం తప్పకుండా పాటించాలి. రాత్రిపూట కొన్ని ఆహార పదార్థాలను తినడం కూడా అవసరం. మీరు అలా చేయాలనుకుంటే.. కింద చెప్పిన వాటిని తప్పకుండా అనుసరించండి. ఇది కచ్చితంగా శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది.

రోజంతా ప్రతి 2 గంటలకు తక్కువ భోజనం తినండి. శరీరం జీవక్రియ పనితీరుకు శక్తి చాలా అవసరం. అటువంటి శక్తిని ఆహారం ద్వారా మాత్రమే పొందవచ్చు. మీరు తీపి, జంక్ ఫుడ్ క...