భారతదేశం, మే 4 -- శరీర బరువు చాలా మందికి మొదటి శత్రువు అని చెప్పాలి. దీనిని తగ్గించుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఎందుకో తగ్గట్లేదు అనే భావన చాలా మందికి ఉంటుంది. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు ఈజీగా బరువు తగ్గవచ్చు. మీరు వ్యాయామం గురించి ఆలోచించలేని పని, అలసట చుట్టూ జీవితం తిరిగితే ఇంకా సమస్యలే. మీరు తినే ఆహారంలో కొద్దిగా అల్లం కలిపితే చాలు. మీరు మీ శరీర బరువును తగ్గించుకోవచ్చు.

అల్లం మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. అందుకే అల్లం వాడితే బరువు తగ్గడం ఖాయం. అయితే అల్లం ఎలా వాడాలి? ఎంత ఉపయోగించాలి? ఈ విషయాల గురించి చూద్దాం..

అల్లంలో జింజెరోల్స్, షోకల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎన్నో మంచి పనులు చేస్తాయి. మీకు తెలుసా అధిక బరువు ఒత్తిడి...