Hyderabad, ఫిబ్రవరి 15 -- ప్రస్తుత జనరేషన్ ఫాలో అవుతున్న లైఫ్‌స్టైల్ బట్టి బరువు పెరగడం చాలా సాధారణమైపోయింది. మన ఆహారపు అలవాట్లు, మొత్తం జీవనశైలి బరువు పెరగడానికి దారితీస్తున్నాయి. ఎంత వేగంగా బరువు పెరుగుతున్నారంటే, మళ్లీ ఎంత కష్టపడినా బరువు తగ్గలేకపోతున్నారు. అంతేకాకుండా, ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. అదే బరువుతో ఉన్నప్పటికీ సమస్యలే. బరువు అమాంతం తగ్గినా కూడా సమస్యలే. మరి ఈ సమస్యకు పరిష్కారంగా క్రమంగా బరువు తగ్గే చిట్కా తన దగ్గర ఉందంటున్నారు న్యూట్రిషనిస్ట్, ఫిట్‌నెస్ కోచ్ విమల్ రాజ్‌పుత్. ఇన్‌స్టాగ్రామ్ బయోలో బరువు తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలను పంచుకున్నారు.

మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బరువు తగ్గింపు సాధ్యమవుతుందని చెప్తున్నారు. వీటిని పాటించడం ద్వారా మీరు 10 కిలోల వరకు బరువు తగ్గవచ్చట. మరి అవేంట...