Hyderabad, ఏప్రిల్ 6 -- మహిళల శరీర బరువులో మార్పులు నెలసరి సమయాన్ని మారుస్తాయట. బరువును బట్టి హార్మోన్ స్థాయిలలో కలిగే తేడాలే ఇందుకు కారణమని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ విధంగా శరీర ఇర్రెగ్యూలర్ (క్రమ రహిత) పీరియడ్స్‌కు దోహదపడతాయి. అంతేకాదు పీరియడ్స్ వచ్చిన తర్వాత, రాకముందు శరీర బరువులో మార్పులు కలుగుతాయట. బరువు పెరగడమనేది పీరియడ్స్ సమయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.

శరీరంలో అధిక కొవ్వు ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలను పెంచి, పీరియడ్స్‌ను ఇర్రెగ్యులర్ చేయవచ్చు. లేదా కొద్దికాలం పాటు పీరియడ్స్ ను నిలిపి వేయచ్చు కూడా.

ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల గర్భాశయం గోడలు మందంగా మారి, ఒక్కోసారి పీరియడ్స్ హెవీగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

అధిక బరువు PCOSకి కారణమవుతుంది. ఇది పీరియడ్స్ ఇర్రెగ్యూలర్‌గా రావడం, అధిక రోమాలు పెరగడం, మొటిమలు...