Hyderabad, మార్చి 26 -- ఆలోచన అనేది రూపంలేని ఒక భావం. కానీ అది ఒక మనిషిని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తుంది లేదా అథ:పాతాళలానికైనా తొక్కేస్తుంది. ఒక వ్యక్తి తాను బలవంతుడు అనుకుంటే ఏదైనా సాధించగలడు. అదే తాను శక్తిసామర్థ్యాలు లేని వాడినని, బలహీనుడని అనుకుంటే విజయానికి సెంటీమీటర్ దూరంలో ఉన్న వాడు కూడా అపజయాన్ని మూటగట్టుకుంటాడు. కాబట్టి ఆలోచనలనేవి మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిద్దివిలా ఉండేలా మీరే చూసుకోవాలి.

మీ బలహీనతలు ఏంటో మీకే తెలుస్తుంది. మీ సమస్యలు కూడా మీకే తెలుస్తాయి. మీ అంతర్గత శక్తులు కూడా మీరే గుర్తించగలరు. కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా బలవంతులు చేసుకోవాలో మీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. పాజిటివ్ ఆలోచనలు మీరు బలవంతుడని చెబితే, నెగిటివ్ ఆలోచనలు మీరు బలహీనుడని చెబుతాయి. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైన వ్యక్తి ఏదీ సాధించలేడు. మంచి ఆలోచనలతో మిమ్మల్ని మీరు మార్చ...