Hyderabad, ఏప్రిల్ 2 -- అనగనగా ఒక రైతు. చాలా పురాతన కాలంలో జీవించేవాడు. ఆ రైతు పంటలు వేస్తున్నప్పుడు చెడిపోతూ ఉండేది. కొన్నిసార్లు భారీ వర్షాలు వచ్చేవి. కొన్నిసార్లు ఎండలు ఎక్కువ అయ్యేవి. కొన్నిసార్లు చలివేసేది. దీనివల్ల పంటలు సగం సగం మాత్రమే చేతికి వచ్చేవి.

దీంతో రైతుకు చాలా అసంతృప్తి కలిగేది. అతను ఎప్పుడూ దేవుడిని తిడుతూ ఉండేవాడు. దేవుడు అంటే అతనికి విపరీతమైన కోపం పెరిగిపోయింది. ఎప్పుడూ శపిస్తూ ఉంటాడు. దేవుడికి రైతు తిట్టిన తిట్లన్నీ వినిపించేవి. ఎప్పుడు చూసినా తననే తిడుతూ ఉంటాడు ఏంటని దేవుడు కూడా ఆలోచించాడు. ఒకరోజు రైతుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు.

రైతు... దేవుడితో 'ఓ ప్రభూ నీకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు. ఎప్పుడూ వర్షం కురిపించాలో తెలీదు. ఎప్పుడు వేడిని పెంచాలో, ఎప్పుడు చలిని తగ్గించాలో తెలియదు. నీవల్లే నా పంట పాడైపోతుంది. దయచేసి పం...