Hyderabad, మార్చి 19 -- పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతడు ఎంతో తెలివైనవాడు. ప్రతి సంవత్సరం తన రాజ్యాన్ని కాపాడేందుకు సమర్థవంతమైన, తెలివైన, శక్తి ఉన్న సైనికులను ఎంపిక చేసుకునేవాడు. ఆ ఎంపిక ప్రక్రియలో అతను ఏనాడు విఫలం కాలేదు. మంచివారిని తెలివిగా ఎంపిక చేసుకునేవాడు. ప్రతి ఏటా సైనికులు ఎంపిక ప్రక్రియ కోసం యువకులు ఎదురుచూసేవారు. ఎందుకంటే ప్రతి ఏటా కొత్త కొత్త పరీక్షలు పెట్టడం ద్వారా సైనికులను ఎంపిక చేసుకునేవాడు. రాజు ప్రతి సంవత్సరం ఏ పరీక్ష పెడతారా? అని ప్రజలు ఎదురుచూస్తూ ఉండేవారు.

అలాగే యువకులకు పరీక్షాకాలం వచ్చేసింది. ఆ రాజు సైన్యంలోకి యువకులను తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రతి ఊరులో కూడా పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పాడు. అలా పోటీల్లో గెలిచిన వారిని ఎంపిక చేసుకొని తగిన శిక్షణ ఇచ్చి తమ సైన్యంలో చేర్చుకుంటామని చెప్పాడు. అలాగే ఆకర్ష...