Hyderabad, మార్చి 12 -- చీమలు చాలా చిన్నగా ఉంటాయి. వాటిని చూసి మనం నేర్చుకునేదేంటి? అని ఎంతోమంది అనుకుంటారు. నిజానికి చీమను మించిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు మరొకరు లేరు. మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు చీమ నుంచి మనం పరిష్కారాన్ని నేర్చుకోవచ్చు. టీం వర్క్ గా, ఒంటరిగా, నాయకుడిగా ఎలా జీవించాలో చీమలు తమ నడవడికతోనే నేర్పిస్తాయి.

చీమలన్నీ కలిసి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసమే ప్రయాణం సాగిస్తాయి. వాటి లక్ష్యం ఆహారాన్ని సేకరించడం. అవి తమ కోసం తాము సేకరించుకోవు. మొత్తం తమ బృందం కోసం సేకరిస్తాయి. ఆ ప్రయాణంలో ఒక్క చీమ కూడా సమయాన్ని వృధా చేయదు. ఒకదాని వెంట ఒకటి ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటాయి. చలికాలంలో పుట్ట నుంచి బయటికి వచ్చి ఆహారాన్ని వెతకలేవు. కాబట్టి వేసవికాలంలోనే చలికాలానికి కావలసిన ఆహారాన్ని కూడా సేకరించి పెట్టుకుంటాయి. అవన్నీ కూడా ఎ...