Hyderabad, ఏప్రిల్ 9 -- ఉదయం నిద్ర లేవగానే తాజాగా, ఆనందంగా అనిపించాలి. ఉదయానే చిరాకుగా నిద్రలేస్తే ఆ రోజంతా కూడా విసుగ్గానే అనిపిస్తుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆఫీసుకు, స్కూళ్లకు బయలుదేరేందుకు రెడీ అవుతూ ఉంటారు. ఉదయం అంతా చాలా హడావుడిగా ఉంటుంది.

మీరు రోజును ప్రారంభించేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నిద్రలేచిన తర్వాత ఒక అరగంట పాటు మీకే సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ అరగంటలో మీరు చేసే పనులు ఆ రోజంతా సానుకూలంగా, శక్తివంతంగా ప్రొడక్టివిటీ ఉండేలా మారుస్తుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎలాంటి అలవాట్లు పాటించాలో తెలుసుకోండి.

మంచి రోజు కోసం మీ రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించండి. మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు మీకు నచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ఆరోజు మంచి రోజు అవ్వాలని కోరుకోండి. అలాగే అన్ని పనులు పూర్తి చేసుకోవాలని ...