తెలంగాణ,కరీంనగర్, ఫిబ్రవరి 22 -- పెళ్ళీలు...పేరంటాలకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ఆహ్వానాలు పలికే ఈ రోజుల్లో హిందూ వివాహం యొక్క విశిష్టత... వివాహం సందర్భంగా జరిగే ఘట్టాలు వివరిస్తూ పెళ్ళి పుస్తకం ముద్రించారు. అతి పెద్ద శుభలేఖను 36 పేజీలతో ఆహ్వాన పత్రికను ముద్రించి బంధుమిత్రులకు ఇచ్చి ఆహ్వానించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కు చెందిన ఓ కుటుంబం.‌ పుస్తక రూపంలో ఉన్న పెళ్లి పత్రిక అందర్నీ ఆకర్షిస్తుంది.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. మొదటి కూతురు కూతురు రవళిక సీఏ పూర్తి చేసింది. ఇటీవల కామారెడ్డి పట్టణానికి చెందిన నాగేంద్ర బాబుతో పెళ్ళి సంబంధం కుదిరింది. ఈనెల 23న వివాహ ముహుర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానించేందుకు శుభలేఖ తయారు చేయాలని సంకల్పి...